రైతులకు సర్కార్ భరోసా ఎక్కడ?
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తో పంట నష్టపోయిన రైతుల వివరాల నమోదు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆరోపించింది.
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం
- పంటనష్టం సర్వేలో కౌలు రైతులకు అన్యాయం
- తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆవేదన
రవీంద్రభారతి/హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తో పంట నష్టపోయిన రైతుల వివరాల నమోదు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆరోపించింది. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో కమిటీ చైర్మన్, ఆర్థికవేత్త ప్రొఫెసర్ నరసింహారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు.
రైతు స్వరాజ్య వేదిక బృందం ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని 10 గ్రామాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయనంలో 145 మందిని పరిశీలించగా, వారిలో 89 మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపా రు. 33 శాతానికిపైగా పంట నష్టం జరిగినప్పటికీ ఒక్క కౌలు రైతు పేరు కూడా పంటనష్టం సర్వేలో నమోదు కాలేదని వెల్లడించారు. స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో కౌలు రైతుల వివరాలు నమోదు కావడం లేదని అన్నారు. కౌలు రైతుల గుర్తింపు కోసం డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఆగస్టు 28న ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటివరకు తొలి సమావేశం నిర్వహించకపోవడం విచారకరమని అన్నారు. రెండు నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 68 మంది రైతుల్లో 51 మంది కౌలు రైతులే ఉన్నారని కమిటీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

