కనీస మద్దతు ధరల చట్టం తేవాలి
కేంద్రంలోని మోదీ ప్రభు త్వం రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడి, అన్నిరకాల పంటలకు కనీస మ ద్దతు ధరల చట్టాన్ని రూపొందించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసిం ది.
- రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలి
- ఎస్కేఎం, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభు త్వం రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడి, అన్నిరకాల పంటలకు కనీస మ ద్దతు ధరల చట్టాన్ని రూపొందించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసిం ది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం హైదరాబాద్ లో వివిధ రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యం లో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ, జేవీ చలపతిరావు, వీ ప్రభాకర్, జకుల వెంకటయ్య, కొండల్, విజయ్ రామకృష్ణ, గౌని ఐల య్య తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తగ్గించడం, ఎత్తివేయడం ద్వారా దేశీయ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని విమర్శించారు.
విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మారెట్లలోకి పెద్దఎత్తున ప్రవేశిస్తుండటంతో రైతుల పంటలకు గిట్టుబా టు ధరలు లభించని పరిస్థితి ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఐదేండ్ల క్రితం ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. మరోవైపు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే విద్యుత్తు, విత్తన చట్టాలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రైతుల హకులను హరించే విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

