2036 ఒలింపిక్స్‌కు భారత్ రోడ్‌మ్యాప్
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తున్న భారత్ 2036 మెగా గేమ్స్ నిర్వహణకు తన రోడ్‌మ్యాప్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు గురువారం ఆన్లైన్లో సమర్పించింది.
- ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు ప్రెజెంటేషన్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తున్న భారత్ 2036 మెగా గేమ్స్ నిర్వహణకు తన రోడ్‌మ్యాప్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు గురువారం ఆన్లైన్లో సమర్పించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చేస్తున్న క్రీడా మౌలిక వసతులు, గత కొన్నేండ్లలో కఠినతరం చేసిన డోపింగ్ నిరోధక చర్యలను ప్రెజెంటేషన్‌లో వివరించింది. ప్రతిపాదిత ఆతిథ్య నగరం అహ్మదాబాద్ సంసిద్ధతపై 30 నిమిషాల ప్రెజెంటేషన్‌కు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, సీఈఓ రఘురామ్ అయ్యర్ నాయకత్వం వహించారు.
అనంతరం కొలిండా గ్రాబర్-కిటరోవిచ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌తో చర్చించింది. దాదాపు 20 నిమిషాలు సాగిన చర్చలో భారత్ ప్రతిపాదిస్తున్న బడ్జెట్, క్రీడల తర్వాత వేదికలు నిరుపయోగంగా మారకుండా తీసుకునే చర్యలు వంటి అంశాలపై కమిషన్ సభ్యులు పలు ప్రశ్నలు సంధించగా ఐఓఏ ప్రతినిధులు వారికి సంతృప్తిర సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

