Ali Larijani | ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజా హతం..?
Ali Larijani : ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు.
Ali Larijani : ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ దాడిలో లారిజానితోపాటు ఇరాన్ టాప్ కమాండర్ గోలాంరెజా సోలేమని కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై ఇరాన్ గట్టిగా పోరాడుతోంది. ఈ పోరాటం వెనుక ఉన్నది మాత్రం ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని అని ఇజ్రాయెల్ విశ్వాసం. ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. ఇటీవల లారిజన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్‌ను అంతం చేస్తానన్నాడు. అయితే, ఆయనెవరో కూడా తనకు తెలియదని ట్రంప్ అన్నాడు. మరోవైపు ముస్లిం దేశాలు తమకు మద్దతుగా నిలవకపోవడంపై లారిజన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇరాన్ సైన్యాన్ని దాడుల్ని లారిజాని పర్యవేక్షిస్తు్న్నట్లు తెలుస్తోంది.
ఖమేనీ హతమవ్వడం, ఆయన తనయుడు మొజ్తాబా గురించి స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం ఇరాన్లో లారిజాని నెం.2 స్థానంలో ఉన్నాడు. ఒకపక్క లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ చెబుతుంటే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో ఒక చేతిరాతతో కూడిన పోస్ట్ వెలువడింది. లారిజాని ఖమేనికి అత్యంత సన్నిహితుడు. ఇటీవల అమెరికాతో జరిపిన అణు చర్చల్లో కూడా అతడు కీలక పాత్ర పోషించాడు. అతడిని ఇరాన్ ప్రజలు కెన్నడీ ఆఫ్ ఇరాన్‌గా పిలుస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

