లక్నో: యూపీ(Uttar Pradesh)లోని లక్నోలో రాంగ్ రూట్ డ్రైవింగ్ ఘర్షణకు దారి తీసింది. రాంగ్ సైడ్‌లో కారు నడుపుతున్న వ్యక్తి.. ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్‌పై దాడి చేశాడు. అతని చెంప చెల్లు మనిపించాడు. అయితే ఆ దాడి చేసిన వ్యక్తిని ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ సరోజ్‌గా గుర్తించారు. చెంప దెబ్బ తిన్న వ్యక్తి ఆర్మీ కల్నల్ ఆనంద్ ప్రకాశ్ సుమన్. కల్నల్‌పై చేయి చేసుకున్న పోలీసు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దాడికి చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
రాంగ్ రూట్లో వచ్చి దాడి చేసిన ఇన్స్పెక్టర్పై కల్నల్ ఫిర్యాదు చేశాడు. తన భార్య, కుమార్తె ముందే ఆ వ్యక్తి దాడి చేసినట్లు కల్నల్ పేర్కొన్నాడు. రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేస్తున్నందుకు ప్రశ్నించడంతో ఆవేశానికి గురైన ఇన్స్పెక్టర్ దాడి చేశాడు. చెంప దెబ్బ తిన్న కల్నల్ ఆనంద్ ప్రస్తుతం పాట్నాలోని ఎన్సీసీ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్నాడు. కారు విండో తీయగానే తిట్టడం మొదలుపెట్టాడని, చెంప దెబ్బ కూడా కొట్టినట్లు ఫిర్యాదులో కల్నల్ తెలిపాడు.
అతన్ని ఆపేందుకు కారు దిగి రాగానే, రెండు కార్ల మధ్య తనను నొక్కిపెట్టే ప్రయత్నం చేశాడన్నాడు. ఎడమ కాలు మీద నుంచి కారును తోలుతూ అతను పరారీ అయినట్లు చెప్పాడు. నిందితుడు ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. కల్నల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ నిపున్ అగర్వాల్ తెలిపారు.
Traffic in Lucknow needs serious attention. People driving on wrong sides to jump signals is a common sight, even in the most important areas, forget the old Lucknow localities. Cops are generally seen standing, chatting with each other while commuters go as they want.
This… pic.twitter.com/6H2A8w2h8k
— Vani Mehrotra (@vani_mehrotra) June 24, 2025