పాట్నా: ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక భావనలో మునిగి ఉండే బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap)లో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నుంచి బహిష్కరించిన ఆయన కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయ్యారు. జూన్ 20న బీహార్ డైరెక్టరేట్ ఆఫ్ ఏవియేషన్, 18 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీహార్ ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోర్సు ట్రైనింగ్‌కు ఎంపికైన 18 మందిలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఐదో ర్యాంకు సాధించారు. 2024 డిసెంబర్ 16 నుంచి 18 వరకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తే విమానాలు నడిపేందుకు అవసరమైన కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందనున్నారు.
కాగా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్ మే 25న సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు తెలిసిన మహిళతో చాలా కాలంగా రిలేషన్లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై ఆగ్రహించారు. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. అలాగే కుటుంబం నుంచి కూడా ఆయనను వెలివేశారు.
Also Read:
Nuclear Power Plant: బీహార్‌కు ఎస్ఎంఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్
Couple Kills Disabled Man | దివ్యాంగుడ్ని చంపిన దంపతులు.. సిమెంట్‌తో నింపిన ట్రంక్‌పెట్టెలో మృతదేహం