న్యూఢిల్లీ: న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌లో భాగంగా బీహార్‌కు తొలి అటామిక్ ప్లాంట్(Nuclear Power Plant) మంజూరీ అయ్యింది. అణు ప్లాంట్ మంజూరీ అయిన ఆరు రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. కేంద్రం ఆమోదం తర్వాత స్మాల్ మోడ్యులార్ రియాక్టర్(ఎస్ఎంఆర్) పవర్ ప్లాంట్‌ను ప్రకటించినట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తెలిపారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ప్లాంట్‌పై ప్రకటన చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీహార్ ప్రభుత్వం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను సెటప్ చేస్తే, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఖట్టార్ తెలిపారు.
ప్లాంట్ సైట్ ఏర్పాటు, ఏ స్థాయిలో ఆ ప్లాంట్ ఉండాలన్న దానిపై తుది రిపోర్టును త్వరలో వెల్లడించనున్నారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్ర బడ్జెట్లో ఈసారి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌కు 20 వేల కోట్లు కేటాయించారు. ఎనర్జీ సెక్యూర్టీని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో అణు విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
కొత్త జనరేషన్ న్యూక్లియర్ టెక్నాలజీతో ఎస్ఎంఆర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. చాలా తక్కువ ఖర్చుతో అనువైన రీతిలో ఆ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారని నిపుణులు చెప్పారు. చిన్న గ్రిడ్స్‌లో వీటిని అమర్చుతారని, అడ్వాన్స్డ్ డిజైన్ వల్ల ఇవి సురక్షితమైనవిగా భావిస్తున్నారు.