హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : రాజకీయాల్లో ప్రత్యర్థులైనా, శుభకార్యాల్లో కలిసినప్పుడు ఉండే సందడి వేరు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కుమారుడి వివాహ వేడుకలో మాత్రం అరుదైన, ఆశ్చర్యకరమైన దృశ్యం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చిన ఈ వేడుకలో.. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు లభించిన ఆదరణ చూసి అధికార పార్టీ నేతలు నివ్వెరపోయారు.
భట్టి విక్రమార పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీరంగ దిగ్గజాలు పెద్దఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయిన వివాహ ప్రాంగణంలోకి కేటీఆర్ అడుగుపెట్టగానే అకడి వాతావరణం ఒకసారిగా మారిపోయింది. సాధారణ ప్రజలతోపాటు వేడుకకు వచ్చిన అతిథులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
యువత, మహిళలు పెద్దసంఖ్యలో కేటీఆర్‌ను చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బందికి వారిని నియంత్రించడం కష్టతరంగా మారింది. ఒకానొక దశలో తోపులాట జరగడంతో భద్రతా సిబ్బందికి చెమటలు పట్టాయి. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ, సెల్ఫీలకు పోజులిస్తూ కేటీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఇంట్లో జరుగుతున్న వేడుకలో ప్రతిపక్ష నాయకుడికి ఈ స్థాయిలో నీరాజనాలు పలుకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
హరీశ్‌రావు రాకతోనూ అదే సీన్
కేటీఆర్ మాత్రమే కాకుండా, అంతకుముందు హరీశ్‌రావు వేడుకకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఆయన చుట్టూ జనం గుమిగూడి ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావుతో ఫొటోలు దిగేందుకు జనం పోటీ పడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే నాయకులుగా కేటీఆర్, హరీశ్‌రావులకు ఉన్న ప్రజల ఆదరణ ఈ వేడుక ద్వారా మరోసారి స్పష్టమైంది. తమ సొంత పార్టీ నాయకుడి వివాహ వేడుకలో ప్రతిపక్ష నాయకులకు లభించిన అనూహ్య స్పందనను చూసి అకడున్న కాంగ్రెస్ నాయకులు అవాకయ్యారు.