Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు ఆమె నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం అశేష ప్రేక్షకాదరణ పొందగా, మరోవైపు త్వరలోనే తల్లిగా మారబోతున్న ఆనందంలో సమంత ఉంది. ఈ నేపథ్యంలో సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుకు సంబంధించిన తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల రాజ్ నిడిమోరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఈ ఫోటోలో రాజ్, సమంత ఇద్దరూ ఒకే రంగు దుస్తుల్లో కనిపించారు.
కెమెరా వైపు సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుండగా, వెనుక కూర్చున్న రాజ్ కూడా అదే తరహా ఫన్నీ లుక్‌తో కనిపించారు. ఈ ఫోటోకు ఆయన “Sam Being Sam” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో అభిమానులు ముచ్చటపడుతున్నారు.సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ జంటపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, సరదా కెమిస్ట్రీ మరోసారి ఈ ఫోటో ద్వారా బయటపడిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత అమ్మతనం గురించి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను పంచుకున్నారు. తల్లి కావడం చాలా కాలంగా తన కల అని, జీవితంలో ఇది అత్యంత ప్రత్యేకమైన అనుభవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కొత్త ప్రయాణాన్ని ఎంతో ప్రేమతో, బాధ్యతతో స్వీకరిస్తానని, ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆమె వెల్లడించారు.
వృత్తిపరంగా కూడా సమంత, రాజ్ నిడిమోరు కలిసి పలు విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పనిచేశారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో ప్రారంభమైన వారి ప్రయాణం, ‘సిటాడెల్: హనీ బన్నీ’, అలాగే ‘రక్త బ్రహ్మాండ్’ వంటి ప్రాజెక్ట్‌ల వరకు కొనసాగింది. తాజాగా ‘మా ఇంటి బంగారం’ విజయంతో ఈ కాంబినేషన్ మరోసారి చర్చనీయాంశమైంది. అయితే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, కొన్ని విషయాలలో మాత్రమే అధికారిక క్లారిటీ వచ్చింది.