Pooja Hegde | పెళ్లి పీటలెక్కనున్న పూజా హెగ్డే .. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత!
Pooja Hegde | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈసారి కొత్త సినిమా, గ్లామరస్ ఫోటోషూట్ లేదా స్పెషల్ సాంగ్ వల్ల కాదు.. ఆమె పెళ్లి వార్తల కారణంగా నెట్టింట చర్చ మొదలైంది. త్వరలోనే పూజా హెగ్డే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
Pooja Hegde | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈసారి కొత్త సినిమా, గ్లామరస్ ఫోటోషూట్ లేదా స్పెషల్ సాంగ్ వల్ల కాదు.. ఆమె పెళ్లి వార్తల కారణంగా నెట్టింట చర్చ మొదలైంది. త్వరలోనే పూజా హెగ్డే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె చేసుకోబోయే వరుడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినా, లేక వ్యాపార రంగానికి చెందినవారా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు పూజా హెగ్డే లేదా ఆమె కుటుంబ సభ్యులు, అధికారిక ప్రతినిధులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవి కేవలం ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.ఇక పూజా హెగ్డే సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే, 2014లో నాగచైతన్య సరసన వచ్చిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం ‘ముకుంద’ సినిమాలో నటించిన ఆమెకు తొలి దశలో ఆశించిన విజయాలు దక్కలేదు. కానీ అల్లు అర్జున్‌తో చేసిన ‘డీజే: దువ్వాడ జగన్నాథం’ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’, మహేష్ బాబుతో ‘మహర్షి’, అల్లు అర్జున్‌తో ‘అలా వైకుంఠపురములో’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘రంగస్థలం’ చిత్రంలోని ‘జిగేలు రాణి’ స్పెషల్ సాంగ్‌తో కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే తరువాత వచ్చిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, తమిళంలో ‘బీస్ట్’, అలాగే బాలీవుడ్లో చేసిన కొన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడంతో ఆమె కెరీర్ కొంత మందగించింది. అయినప్పటికీ పూజా హెగ్డే వరుస ప్రాజెక్ట్‌లతో మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో ‘శ్రీశ్రీ’ చిత్రంలో నటిస్తుండగా, రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచన 4లో కథానాయికగా కనిపించనున్నారు. అలాగే అల్లు అర్జున్ సరసన మరోసారి నటించే అవకాశముందని కూడా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

