ఇండస్ట్రీలోనే ఉన్నా..
వెండితెర ప్రేక్షకుల్ని అలరించే హీరో హీరోయిన్లు కొంతకాలం పాటు సినిమాల్లో కనిపించకపోతే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. తాజాగా అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇలాంటి రూమర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అను ఈమధ్య సినిమాల్లో కనిపించకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైపోయిందంటూ ప్రచారం మొదలైంది.
వెండితెర ప్రేక్షకుల్ని అలరించే హీరో హీరోయిన్లు కొంతకాలం పాటు సినిమాల్లో కనిపించకపోతే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. తాజాగా అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇలాంటి రూమర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అను ఈమధ్య సినిమాల్లో కనిపించకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైపోయిందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ తాను ఇండస్ట్రీలోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది అను.
‘అసలు నేను నటనకు దూరమయ్యానని ఎవరు చెప్పారు? అలా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను ఎవరు మొదలుపెడతారో అర్థం కావడం లేదు. సినిమా పరిశ్రమను వదిలేసి వెళ్లే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. కాకపోతే రొటీన్ పాత్రలు కాకుండా నటనకు ఆసారమున్న మంచి కథల కోసమే చూస్తున్నాను. త్వరలోనే నా కొత్త సినిమాల వివరాలను స్వయంగా ప్రకటిస్తాను’ అని చెప్పుకొచ్చింది.
కాగా, మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి చిత్రంలోనే తన చలాకీ నటన, అందంతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’లో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య..’ వంటి భారీ ప్రాజెక్టుల్లో కనిపించే లకీ చాన్స్ కొట్టేసింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

