క్వింగ్డోవ్: షాంఘై సహకార సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో రూపొందించిన సంయుక్త డిక్లేరేషన్(SCO Declaration)పై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. ఆ డిక్లరేషన్‌పై సంతకం చేయబోమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాలోని క్వింగ్డావోలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ఆ డిక్లరేషన్‌లో ప్రస్తావన చేయని కారణంగా.. ఎస్సీవో డిక్లరేషన్‌పై సంతకం చేయడంలేదని మంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు.
ఉగ్రవాద అంశంపై సమావేశాల్లో చర్చించారు. ఈ నేపథ్యంలో జాయింట్ డిక్లరేషన్ సమర్పించారు. కానీ ఉగ్రవాదంపై ఇండియా వ్యక్తం చేసిన అభిప్రాయాలను దాంట్లో పేర్కొనలేదు. అయితే భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. జాయింట్ డిక్లరేషన్‌ను నిలిపివేశారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు భారత్ ఆరోపిస్తున్నది.
ఎస్సీవో డిక్లరేషన్‌లో బలోచిస్తాన్లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించారు. మార్చిలో హైజాక్ అయిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఘటనను ఖండించారు. కానీ ఆ డాక్యుమెంట్ నుంచి పెహల్గామ్ దాడి విషయాన్ని తొలగించారు. దీంతో రాజ్‌నాథ్‌తో పాటు భారత బృందం ఆ డిక్లరేషన్‌ను వ్యతిరేకించింది.