Vetlapalem Explosion | వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మరొకరు మృతి.. 28కి చేరిన మృతుల సంఖ్య
Vetlapalem Explosion | కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు లో గురువారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది.
కాకినాడ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ( Vetlapalem ) లో బాణసంచా ( fireworks ) తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ( Explosion ) లో గురువారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్కు చెందిన వెంకటలక్ష్మి(69) మృతి చెందింది. ఫిబ్రవరి 28న బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో 23 మంది సజీవ దహనమం కాగా మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. అప్పటి నుంచి రోజుకొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. మంగళవారం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోవరాజు, బుధవారం వీర శ్రీను (39) , మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన నలుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

