KP Sharma Oli : నేపాల్ (Nepal) లో సాధారణ ఎన్నికల (General Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జనం ఉదయం నుంచే బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడి రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ తమతమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. ఈ మధ్యాహ్నం నేపాల్ మాజీ ప్రధాని (Nepal Ex PM) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఓటువేశారు.
భక్తాపూర్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన జన్ జడ్ (Gen Z) ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో 77 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఓలి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – యూనిఫైడ్ మార్క్సిస్ట్, లెనినిస్ట్ (CPN-UML) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నారు.
కాగా నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Nepal: Former Prime Minister and Prime Ministerial Candidate of Communist Party of Nepal (Unified Marxist–Leninist) (CPN-UML), KP Sharma Oli casts his vote at a Polling Station in Bhaktapur, for Nepal’s General Elections 2026. pic.twitter.com/4q3YpZCIYh
— ANI (@ANI) March 5, 2026