తిరువనంతపురం: హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి బంగారం చోరీ అయ్యింది. అత్యంత భద్రత ఉండే జడ్జి నివాసంలో ఈ దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. (Gold Stolen From Judge’s Bedroom) ఆ న్యాయమూర్తి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ బధరుద్దీన్ నివాసంలో గురువారం చోరీ జరిగింది. ఆయన బెడ్రూమ్లోని లాకర్లో ఉంచిన సుమారు 44 గ్రాములున్న ఆరు బంగారు గోల్డ్ కాయిన్స్ మాయమయ్యాయి. ఈ నేపథ్యంలో తన నివాసం పరిధిలోని కలమస్సేరి పోలీస్ స్టేషన్లో ఆ జడ్జి ఫిర్యాదు చేశారు.
కాగా, అత్యంత సెక్యూరిటీ ఉండే న్యాయమూర్తి నివాసంలో గోల్డ్ చోరీ జరుగడంపై పోలీసులు షాక్ అయ్యారు. జడ్జి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ న్యాయమూర్తి బెడ్ రూంలో ఈ సంఘటన జరుగడంతో ప్రశ్నించాల్సిన వ్యక్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
Also Read:
Watch: మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు
Watch: ట్రాక్టర్ టైరు కింద ఇద్దరిని తొక్కించిన డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?