బెంగళూరు: గూడ్స్ వాహనం, ట్రాక్టర్ స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ సంఘటన ఘర్షణకు దారి తీసింది. ట్రాక్టర్ డ్రైవర్ను నిలువరించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక టైర్ ముందు పడటంతో వారిపై నుంచి వెళ్లింది. (Driver Runs Tractor Over 2 Men) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్, గూడ్స్ వాహనం స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో వారి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
కాగా, ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ను పట్టుకుని కిందకు లాగేందుకు గూడ్స్ వాహనం వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో ట్రాక్టర్ వెనుక టైర్ వారిమీద నుంచి వెళ్లింది. కొంత దూరం వెళ్లిన ఆ ట్రాక్టర్ ఆగడంతో కొందరు వ్యక్తులు డ్రైవర్ను చుట్టుముట్టి కొట్టారు.
మరోవైపు ట్రాక్టర్ టైర్ కింద పడిన ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
*ಕಲಘಟಗಿ: ಇಬ್ಬರ ಮೇಲೆ ಹರಿದ ಟ್ರಾಕ್ಟರ್: ಅದೃಷ್ಟವಶಾತ್ ಪ್ರಾಣಾಪಾಯದಿಂದ ಪಾರು*https://t.co/xH1uTzQNYh
*Download the App and know your city news* – https://t.co/HTbKZOpbII pic.twitter.com/zFBkzYTHY2— PublicNext (@ElectReps) June 26, 2025
Also Read:
Watch: ఇండిగో విమానంలో లైఫ్ జాకెట్ దొంగిలించిన ప్రయాణికుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు
Watch: మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?