న్యూఢిల్లీ: ఇండిగో విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు లైఫ్ జాకెట్ దొంగిలించాడు. (Man Attempts To Steal Life Jacket) మెల్లగా తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. మరో ప్రయాణికుడు ఇది చూశాడు. బ్యాగ్ తెరువాలని అతడ్ని బలవంతం చేశాడు. లైఫ్ జాకెట్ చోరీ చేసిన వ్యక్తిని నిలదీశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండిగో విమానం ఆకాశంలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు లైఫ్ జాకెట్ చోరీ చేశాడు. మెల్లగా తన బ్యాగ్లో దాచాడు.
కాగా, మరో ప్రయాణికుడు దీనిని గమనించాడు. ఏం చేస్తున్నావని ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. తాను అంతా చూశానని, బ్యాగ్ తెరువాలని చెప్పాడు. అందులో లైఫ్ జాకెట్ ఉండటంతో దానిని చోరీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రయాణికుల భద్రత కోసం ఉంచిన లైఫ్ జాకెట్ను చోరీ చేసి పాడుచేయడం సరికాదని మండిపడ్డాడు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో అన్నది తెలియలేదు. అలాగే ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఈ సంఘటనపై స్పందించలేదు.
మరోవైపు కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. లైఫ్ జాకెట్ చోరీ చేసిన ప్రయాణికుడిపై చర్యలు చేపట్టాలని కొందరు డిమాండ్ చేశారు.
కాగా, దేశమంతటా భయాందోళన రేకిత్తించిన అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నేపథ్యంలో ఆ వ్యక్తి చర్యను మరికొందరు సమర్థించారు. ‘సాహసోపేతమైన చర్య. భూమి మీద కాకుండా సముద్రంపై విమాన ప్రమాదం జరుగవచ్చని అతడు ఆందోళన చెందిఉంటాడు’ అని ఒకరు చమత్కరించారు.
A Passenger got Caught Allegedly Stealing life jacked on Flight:
pic.twitter.com/TM02zd1jGW— Ghar Ke Kalesh (@gharkekalesh) June 25, 2025
Also Read:
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు
Watch: మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Cop Caught Taking Bribe | రూ.95,000 లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మహిళా పోలీస్