Balka Suman | బాల్క సుమన్‌పై కేసు కొట్టివేసిన హైకోర్టు.. ఏవోకు ఫిర్యాదు పరిధి లేదని స్పష్టీకరణ
Balka Suman | బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపై చెన్నూర్‌లో నమోదైన కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
Balka Suman | చెన్నూర్, మార్చి 11: బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపై చెన్నూర్‌లో నమోదైన కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
చెన్నూరు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనతోపాటు చెన్నూరు జడ్పీ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ బాల్క సుమన్, రాజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే సుజన బుధవారం విచారణ జరిపారు. మండల వ్యవసాయ అధికారి కే యామిని ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఫిర్యాదు చేసే పరిధి ఆ అధికారికి లేదని తీర్పులో పేరొన్నారు.
ఈ కేసుపై బాల్క సుమన్ తరఫు న్యాయవాది, బీఆర్ఎస్ లీగల్‌సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం మల్లేశంగౌడ్ చెన్నూర్‌లో మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు బైక్‌పై వచ్చి ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేశారని తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ బాల్క సుమన్, ఇతర నాయకులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలిపారని పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ చెన్నూర్ పోలీసులు.. బాల్క సుమన్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే ఇది తప్పుడు కేసు, చెల్లని కేసు అని బాల్క సుమన్‌తో పాటు మూల రాజిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు కొట్టి వేస్తూ తీర్పునిచ్చిందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

