ముంబై: మహిళా పోలీస్ ఒక వ్యక్తి నుంచి రూ.95,000 లంచం తీసుకున్నది. ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు, రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఈ లంచం డిమాండ్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఆసుపత్రిలో చేరాడు. (Woman Cop Caught Taking Bribe) మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడికి సహాయం కోసం ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోని ఇన్స్పెక్టర్ను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో సహోద్యోగి అయిన 34 ఏళ్ల మహిళా పోలీస్ నాయక్‌ను కలవాలని ఆ అధికారి చెప్పాడు.
కాగా, మహిళా పోలీస్ ఆ వ్యక్తిని లక్ష లంచం డిమాండ్ చేసింది. చివరకు రూ.95,000కు ఒప్పందం కుదిరింది. అయితే ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ట్రాప్ వేశారు. జూన్ 25న ధారాశివ్‌లోని ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో ఆ వ్యక్తి నుంచి రూ.95,000 లంచం తీసుకున్న మహిళా పోలీస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెతోపాటు ఆ వ్యక్తి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మహిళా పోలీస్‌ను లంచం తీసుకోవాలని పురికొల్పిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ విషయం తెలిసి షాక్ అయ్యాడు. అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అతడి ఇంట్లో సోదాలు చేసినట్లు చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: మహిళా పోలీస్ అధికారిణి పట్ల.. అసభ్యకరంగా ప్రవర్తించిన బీజేపీ నేత, కేసు నమోదు
Watch: మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?