హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటైంది. దీని పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ బుధవారం జీవో జారీచేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉత్తర డిస్కమ్ (టీజీఎన్పీడీసీఎల్), దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ పరిధిలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, జలమండలి, మున్సిపల్ వాటర్ కనెక్షన్లు, మిషన్ భగీరథ పథకాల విద్యుత్తు కనెక్షన్లను చేర్చారు. ఈ డిస్కమ్ సీఎండీగా ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫారూఖీని గతంలోనే నియమించిన ప్రభుత్వం.. తాజాగా బోర్డు డైరెక్టర్లుగా పీ కృష్ణారెడ్డి, వీ తిరుపతిరెడ్డి, వీ మోహన్‌రావు, ఎన్ నర్సింహులును నియమించింది. వీరిలో తిరుపతిరెడ్డి, మోహన్‌రావు ఉత్తర డిస్కమ్‌లో.. కృష్ణారెడ్డి, నర్సింహులు దక్షిణ డిస్కమ్తోపాటు రైతు డిస్కమ్లోను డైరెక్టర్లుగా కొనసాగుతారు.
పుట్టుకతోనే అప్పుల్లో రైతు డిస్కమ్
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు ఆర్థికంగా కుదేలయ్యాయి. వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం నుంచి ఆ డిస్కమ్‌ల అప్పులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పుడు వాటిలో సింహభాగాన్ని రైతు డిస్కమ్ ఖాతాలో వేశారు. దీంతో కొత్త డిస్కమ్ పుట్టుకతోనే రూ.వేల కోట్ల అప్పులతో ఆవిర్భవించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్కు రూ.45,398 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. వీటిలో రూ.35,982 కోట్లతోపాటు టీజీజెన్కో, సింగరేణి సంస్థలకు ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.31,697 కోట్ల బకాయిల్లో రూ.26,950 కోట్లు, మరో రూ.9,032 కోట్ల రుణాలను రైతు డిస్కమ్‌కు బదలాయించారు.
పాత డిస్కమ్‌ల ద్వారా మళ్లీ అప్పులు
కొత్త అప్పుల కోసమే కాంగ్రెస్ సర్కార్ రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతమున్న ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు మొండి బకాయిలు, ఆర్థికలోటుతో సతమతమవుతున్నాయి. దీంతో వాటికి కొత్తగా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు, ఆర్ఈసీ, పీఎఫ్సీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఆ పాత డిస్కమ్‌ల అప్పులు, బకాయిలను రైతు డిస్కంకు బదలాయించారు. తద్వారా ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు చూపి, భవిష్యత్తులో అందినకాడికి అప్పులు చేయనున్నారు. అందుకోసమే రైతు డిస్కమ్ ఏర్పాటైందని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు. రైతు డిస్కమ్ అంటే రైతుల మేలు కోసం ఏర్పాటైంది కాదని, పాత డిస్కమ్‌ల ద్వారా అప్పులు తెచ్చేందుకే ప్రభుత్వం రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేసిందని చెప్తున్నారు.
మూడో డిసమ్ పరిధిలోకి వచ్చే కనెక్షన్లు ఇవే..
కనెక్షన్లు సంఖ్య