హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ఘనంగా సాగింది. పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులను పెంచుకున్నది. సాగునీటి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నది. అప్పుల నియంత్రణలో మేటిగా నిలిచింది. ఈ విషయం నీతిఆయోగ్ తాజాగా విడుదలచేసిన ఆర్థిక ఆరోగ్య సూచి (ఎఫ్హెచ్ఐ) 2023-24 నివేదికలో వెల్లడైంది. వ్యయ నాణ్యత, ఆదాయ సమీకరణ, రుణ స్థిరత్వం వంటి ఐదు కీలక అంశాల ప్రాతిపదికన రూపొందించిన ఎఫ్హెచ్ఐలో ఒడిశా అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఉన్న రాష్ట్రాల జాబితాలో చేరింది. ముఖ్యంగా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో, అప్పులను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మొత్తం 18 ప్రధాన రాష్ట్రాల జాబితాలో 44.3 సోరుతో 7వ స్థానంలో నిలిచి, మధ్యస్థ ఆర్థిక బలం కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తన సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విశేషమైన ప్రతిభ కనబరిచింది. ఆదాయ సమీకరణలో తెలంగాణ 60.8 మారులు సాధించింది. ప్రధాన రాష్ట్రాలైన గుజరాత్ (44.8), కర్ణాటక (43.2) కంటే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. పన్నుల వసూళ్లు, పన్నేతర ఆదాయ మార్గాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పునాది బలంగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
అప్పుల నిర్వహణలో తెలంగాణ ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నట్టు ఎఫ్హెచ్ఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుణ ఇండెక్స్‌లో తెలంగాణ 53.5 సోరు నమోదు చేసింది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (36.6), తమిళనాడు (39.1), కేరళ (23.3)తో పోలిస్తే తెలంగాణ అప్పుల భారం తకువగా ఉండటమే కాకుండా, రీఫైనాన్సింగ్ రిస్ కూడా తకువగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. రుణాలను ఉత్పాదక రంగాల్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని ఎఫ్హెచ్ఐ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, రుణ స్థిరత్వ విభాగంలో 20.0 సోరు మాత్రమే సాధించింది. అంటే, అప్పులు తీర్చే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని, వడ్డీ చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవాలని సూచించింది. సొంత ఆదాయంపై ఆధారపడటం, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ చూపుతున్న చొరవ వల్ల రాష్ట్రం ఆర్థికంగా పరిణతి సాధిస్తున్నట్టు నివేదిక ప్రశంసించింది.

పదేండ్ల కేసీఆర్ పాలన ఆర్థిక స్థిరత్వం కొనసాగిందని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి 2023-24 నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా 2014-15 నుంచి 2023-24 వరకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులకు లోనుకాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించినట్టు తెలిపింది. ఈ పదేండ్ల పాలనలో ఎప్పుడు కూడా ఏడు ర్యాంకుల్లోపే నిలిచింది. 2020-21 నుంచి 2022-23 కొవిడ్ కాలంలో కాస్త ఆర్థిక వెసులుబాటు లేక 9వ ర్యాంకుకు చేరింది. మిగతా 8 ఏండ్లు 7వ ర్యాంకులోనే ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది. 2022-23లో రాష్ట్ర ఎఫ్హెచ్ఐ స్కోరు 43.4తో 8వ ర్యాంకులో నిలిచింది. 2023-24లో ఎఫ్హెచ్ఏ స్కోరు 44.3కి పెంచుకొని ఒక ర్యాంకును మెరుగుపర్చుకొని 7వ స్థానంలో నిలిచింది.

తెలంగాణ అచీవర్ హోదా సాధించింది. 2022-23తో పోలిస్తే 2023-24లో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది. గతంలో ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అచీవర్ క్యాటగిరీలోకి ప్రవేశించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులు, వివేకవంతమైన అప్పుల నిర్వహణ, తెలంగాణను ఆర్థికంగా నిలకడగా ఉంచాయి. బీహార్, కర్ణాటకతోపాటు తెలంగాణ కూడా స్వల్ప ఆర్థిక రికవరీని కనబరిచినట్టు నివేదిక పేరొంది. తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆర్థిక సూచికలు బలహీనపడటంతో వాటి ర్యాంకులు పడిపోయాయి. తమిళనాడు ఆస్పిరేషనల్ గ్రూపునకు పడిపోవడం గమనార్హం.
అచీవర్స్: ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్
ఫ్రంట్ రన్నర్స్: కర్ణాటక, గోవా, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్
ఆస్పిరేషనల్: కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్
అభివృద్ధి పనులపై పెట్టుబడులను పెంచిన రాష్ట్రాల ఆర్థిక స్థితి మెరుగుపడింది. కేవలం ఉచితాలు లేదా వినియోగంపైనే ఖర్చు చేసే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక పరిణతి చాటుకున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నప్పటికీ, జీతాలు, పెన్షన్లు వంటి ఖర్చులు ఎకువగా ఉండటం వల్ల కొత్త పథకాలకు నిధుల కొరతను ఎదురొంటున్నాయి.