హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.40,769 కోట్ల అంచనా వ్యయంతో 21 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఆరు కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులు, 15 ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు.