Degree | డిగ్రీతోనే స్టాప్.. ఉన్నత చదువులకు బ్రేక్.. మారుతున్న విద్యార్థుల అభిరుచులు
Degree |ఉన్నత విద్యలో చేరాలనుకొనే విద్యార్థుల అభిరుచులు మారిపోతున్నాయి. అత్యధికులు డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సుల్లో 50% లోపు మాత్రమే సీట్లు నిండుతున్నాయి.
Degree |హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో చేరాలనుకొనే విద్యార్థుల అభిరుచులు మారిపోతున్నాయి. అత్యధికులు డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సుల్లో 50% లోపు మాత్రమే సీట్లు నిండుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య 13,07,803. అదే పీజీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య 2,41,910 మాత్రమే.
అంటే డిగ్రీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థులతో పోల్చితే పీజీ కోర్సుల్లో చేరిన వారి శాతం కేవలం 18శాతమే. కన్వెన్షల్ వర్సిటీల్లో 10,20,796 మంది డిగ్రీ కోర్సుల్లో చేరితే, పీజీ కోర్సుల్లో చేరిన వారు 1,64,800 మంది మాత్రమే. ఇక స్పెషలైజ్డ్ వర్సిటీల్లో 2,02,649 మంది డిగ్రీ కోర్సుల్లో చేరితే పీజీ కోర్సుల్లో 20,048 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చదవడమంటేనే గతంలో క్రేజీ ఉండేది. కానిప్పుడా క్రేజీ కనిపిండచంలేదు. ఏ యూనివర్సిటీ తీసుకున్నా.. ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా ఇదే పరిస్థితి నెలకొన్నది.
స్పెషలైజ్డ్ వర్సిటీల్లోనూ..
- కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో డిగ్రీ కోర్సుల్లో 1,95, 523 మంది విద్యార్థులుండగా, పీజీ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 19,662 మాత్రమే.
- హార్టికల్చర్ వర్సిటీలోని డిగ్రీ కోర్సుల్లో 1,316 మంది విద్యార్థులుంటే పీజీ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 289 మాత్రమే.
- వెటర్నరీ వర్సిటీ యూజీ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ 1,348కాగా, పీజీ కోర్సుల్లో 97మంది మాత్రమే
కారణాలివే.. - డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు త్వరగా జీవితంలో స్థిరపడాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నారు. రీసెర్చ్ వైపు, పీహెచ్‌డీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
- ఐటీ, మార్కెటింగ్, సేవారంగాల్లో డిగ్రీతోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో రెండేండ్ల పీజీ కోర్సులో చేరేందుకు ఆసక్తిచూపడంలేదు.
- విద్యార్థుల అభిరుచులు మారుతున్నాయి. ఉద్యోగ మార్కెట్ నేపథ్యంలో డిగ్రీ పూర్తికాగానే డాటాసైన్స్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరుతున్నారు.
- డిగ్రీ తర్వాత పీజీలో కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్నాయి. ఇవి పేద విద్యార్థులకు భారమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందడంలేదు. ఇది కూడా ఓ కారణం.
- పీజీ కోర్సు చేసినా కూడా ప్రారంభవేతనాలు డిగ్రీ చేసిన వారితో సమానంగానే ఉంటున్నాయి. పీజీ చేసే ఖర్చుకు తగిన ప్రతిఫలం లభించడంలేదన్న అభిప్రాయాలున్నాయి.
- గ్రూప్స్, బ్యాంకింగ్ సహా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిగ్రీ అర్హతనే అడుగుతున్నారు. పీజీ చదవడం కన్నా.. పోటీ పరీక్షలకు సిద్ధమవడం ఉత్తమమన్న భావనలో విద్యార్థులున్నారు.
- ఉన్నత చదువులు చదవాలనుకునే వారు, విదేశాల్లో స్థిరపడాలనుకునే వారు మన దేశంలో పీజీ చేయడం కన్నా.. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో పీజీ చేసేందుకు ఇష్టపడుతున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Degree
- PG
- post graduation
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

