Nirudyoga JAC | సుమారు 20 వేలకు బదులు కేవలం 7437 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయడం, వయోపరిమితి 36 సంవత్సరాలు పెంచకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న 7434 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ మండిపడింది. 20 వేల ఖాళీలుటే తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని జేఏసీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వయోపరిమితి పెంచకపోవడంతో ఎంతో కష్టపడి ప్రిపేరవుతున్న చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, ఇంద్రా నాయక్, నవీన్ పట్నాయక్, శింబు, భూక్యా కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి సరూర్నగర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఆగస్టు 5న శాంతియుత ర్యాలీ
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ ఆగస్టు 5న శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు, విద్యార్థులు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరింది. 20 వేల ఎస్సై, పీసీ (SI, PC) నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎస్సైకి 38, పీసీకి 36 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి. జీవో నంబర్ 46 రద్దు చేయాలి. రోడ్డుపై పడేసిన టీజీపీఎస్సీ (TGPSC) ఓఎంఆర్ షీట్లపై విచారణ చేయాలి. మెగా డీఎస్సీ (DSC), గ్రూప్1, 2, 3, 4, FBO, GPO, JL, DL, FRO, FSO, విద్యుత్ రంగంలో తదితర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేయాలి. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆచరణలో పెట్టాలని కోరుతూ ఈ ర్యాలీ చేపట్టామని జేఏసీ వెల్లడించింది.

Nirudyoga Jac