PV Sindhu | ఒక్కరోజులో మూడు మ్యాచ్‌లా?.. ఆసియా క్రీడల నిర్వాహకులపై సింధు ఫైర్..!
PV Sindhu : ఆసియా క్రీడల్లో పతకం గెలవాలనుకున్న పీవీ సింధు (PV Sindhu )కల చెదిరింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిందీ తెలుగు తేజం.
PV Sindhu : ఆసియా క్రీడల్లో పతకం గెలవాలనుకున్న పీవీ సింధు (PV Sindhu )కల చెదిరింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిందీ తెలుగు తేజం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్ యుఫీ(చైనా) చేతిలో కంగుతిన్న సింధు నిర్వాహకులపై మండిపడింది. ఒక్కరోజులో మూడు మ్యాచ్‌లు ఏంటీ? అసలు ఇదేం షెడ్యూల్? అంటూ ఫైర్ అయిందీ ఒలింపిక్ విజేత. అంతేకాదు కోర్టులో రివ్యూ కెమెరాలు లేకపోవడాన్ని కూడా సింధు తప్పుపట్టింది.
జపాన్‌లోని ఐచీ నగోయలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఆదివారం చైనా షట్లర్ చెన్ యుఫీపై 21-11తో తొలి సెట్ గెలుపొందిన సింధు ఆ తర్వాత తడబడింది. నాలుగో సీడ్ ధాటికి వరసగా రెండు సెట్లను 18-21, 10-21తో కోల్పోయిన తెలుగుతేజం టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా సరిపోను మ్యాచ్ సన్నద్ధత లేకపోవడం వల్లనే తాను ఓటమి పాలయ్యానని సింధు వాపోయింది.
𝟑 𝐦𝐚𝐭𝐜𝐡𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐡𝐨𝐮𝐫𝐬: 𝐏𝐕 𝐒𝐢𝐧𝐝𝐡𝐮 𝐜𝐫𝐢𝐭𝐢𝐜𝐢𝐬𝐞𝐬 𝐛𝐚𝐝𝐦𝐢𝐧𝐭𝐨𝐧 𝐬𝐜𝐡𝐞𝐝𝐮𝐥𝐢𝐧𝐠 𝐚𝐟𝐭𝐞𝐫 𝐦𝐢𝐬𝐬𝐢𝐧𝐠 𝐦𝐞𝐝𝐚𝐥#PVSindhu played three matches in 24 hours before losing her Asian Games quarter-final to Chen Yufei. The two-time Olympic… pic.twitter.com/KrJ6oEB3YV
— IndiaToday (@IndiaToday) September 27, 2026
భారత స్టార్ ఒక్క రోజులనే మూడు మ్యాచ్‌లు ఆడింది. శనివారం ఉదయం 12:07 గంటలకు రెండో మ్యాచ్ ఆడిన తను.. ఆదివారం చెన్ యుఫీతో క్వార్టర్ ఫైనల్ కోసం కోర్టుకు వచ్చేసింది. దాంతో.. తీరిక లేకుండా ఆడడం, నిద్ర లేకపోవడానికి తోడు సరైన నిర్వహణ లోపించడం కారణంగా పతకం చేజారిందని సింధు తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

