Lenin Movie | టాలీవుడ్ యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని కెరీర్లో ఓ సరికొత్త చరిత్రాత్మక అధ్యాయం మొదలైంది. ఆయన నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ, ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. దీంతో అఖిల్ కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్‌ను నమోదు చేయడంతో పాటు తొలి రూ.100 కోట్ల సినిమాగా రికార్డులకెక్కింది. జూలై 10న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.
దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాలో అఖిల్ కొత్త మేకోవర్, పవర్ ప్యాక్డ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-ఓల్టేజ్ ఎమోషనల్ సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేశాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాత నాగవంశీ, నాగార్జున అనుసరించిన పబ్లిసిటీ వ్యూహాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక తమ అభిమాన హీరో అఖిల్ ఖాతాలో తొలి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ పడటంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
The ROAR has reached 100 CRORE+ WORLDWIDE GROSS ❤️🔥❤️🔥
A celebration that belongs to every audience member who stood by #LENIN 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/gncmWpZkZT
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2026