Vishwambhara | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఆయన అభిమానులు ఇప్పటినుంచే ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఆగష్టు 22న రానున్న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా ఇంతకాలం ఆలస్యం అయినప్పటికీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా ముగింపు దశకు తీసుకువచ్చింది. యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల తార త్రిష నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన బాణీలు, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఈ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్‌ను దసరా పండుగకు టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 22న చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా చిత్రబృందం ప్రకటించబోతున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి దసరా పండుగకు రాబోతుండటం అంతకంటే ఒక్కరోజు ముందుగానే రజనీకాంత్ జైలర్ 2 ప్రేక్షకులు రాబోతుండడంతో ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ భారీ పోటీతో టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ బాక్సాఫీస్ వార్ తారాస్థాయికి చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.