Famers | పంటను కాపాడుకునేందుకు జనరేటర్ల వినియోగం.. కరెంట్ కోతలతో అన్నదాతలకు తలకుమించిన భారం
Famers | తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం లోవోల్టేజీతో ఆరు గంటలు మాత్రమే విడతలవారీగా సరఫరా చేస్తుండటంతో పంట ను కాపాడుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Famers | నిజాంపేట్, అక్టోబర్3 : అప్పులు చేసి వరి పంట సాగు చేసిన రైతులను విద్యుత్తు సమస్య వేధిస్తున్నది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల పరిధిలోని మేఘ్యానాయక్తండా, మునిగేపల్లిశివారులో వందలాది ఎకరాల్లో వరిపంట సాగుచేశారు. తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం లోవోల్టేజీతో ఆరు గంటలు మాత్రమే విడతలవారీగా సరఫరా చేస్తుండటంతో పంట ను కాపాడుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కండ్ల్లముందే ఎండుతున్న పంటలు, ఓ వైపు కాలిపోతున్న మోటర్లను చూస్తున్న రైతన్నల గుండెలు బరువెక్కుతున్నాయి. మరికొందరు జనరేటర్ సహాయంతో వరిపంటను దక్కించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
రెండు ఎకరాల్లో వరి పంటసాగు చేశా. ఇప్పుడు పొట్ట దశలో ఉన్నది. ప్రభుత్వం కరెంట్ సరిగా సరఫరా చేయడం లేదు. లోవోల్టేజీ సమస్య వల్ల బోరు మోటర్లు నడుస్తలేవు. పంట ఎండిపోయే దశకు రావడం చూసి జనరేటర్ అద్దెకు తీసుకొచ్చా. రోజుకు రూ.3వేల చొప్పున మూడు రోజుల పాటు పొలానికి నీళ్లు పెట్టా. మొత్తం 19 వేల వరకు ఖర్చు అయ్యింది.
– టికారం,రైతు, మేఘ్యనాయక్తండా(సంగారెడ్డి జిల్లా)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

