హనుమకొండ, మార్చి 8 : హనుమకొండ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యురాలు చెన్నమనేని జయశ్రీ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. తమ బంధువు, ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు అక్క కూతురైన జయశ్రీ మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ తన సోదరితో కలిసి ఆదివారం హనుమకొండకు చేరుకొన్నారు.
జయశ్రీ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు తదితరులు ఉన్నారు.