Sujit Sinha | పోలీస్ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం
Sujit Sinha | జార్ఖండ్ (Jharkhand) కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ (Most wanted Gangster) సుజిత్ సిన్హా (Sujit Sinha) పోలీసుల ఎన్కౌంటర్ (Police Encounter) లో హతమయ్యాడు. సుజిత్‌ను సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలు (Sahibganj Divisional Jail) నుంచి ధన్‌బాద్ (Dhanbad) కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Sujit Sinha : జార్ఖండ్ (Jharkhand) కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ (Most wanted Gangster) సుజిత్ సిన్హా (Sujit Sinha) పోలీసుల ఎన్కౌంటర్ (Police Encounter) లో హతమయ్యాడు. సుజిత్‌ను సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలు (Sahibganj Divisional Jail) నుంచి ధన్‌బాద్ (Dhanbad) కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు. అదే అదనుగా భావించిన అతడు ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని చీకట్లోకి పరుగెత్తాడు. పోలీసులు అతడిని వెంబడించడంతో వారిపైకి కాల్పులు జరిపాడు.
దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుజీత్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. సుజిత్ సిన్హాపై హత్యలు, వసూళ్లు, ఇతర నేరాలకు సంబంధించిన అనేక కేసులు నమోదై ఉన్నాయి. చాలాకాలంగా అతడు జార్ఖండ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

