Delhi Police | ఆ బాలికపై కేసును కొనసాగించబోం.. స్పష్టంచేసిన ఢిల్లీ పోలీసులు
Delhi Police | నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల ‘జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR)’ నమోదుచేసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ (Parliament Street PS) కు బదిలీచేశారు.
Delhi Police : నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల ‘జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR)’ నమోదుచేసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ (Parliament Street PS) కు బదిలీచేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధాని పదవిని అగౌరవపర్చేలా, శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
అయితే ప్రస్తుతం ఆ బాలికపై కేసును కొనసాగించడం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తన కుమార్తెపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పోలీసులు వయసు 25 ఏళ్లుగా నమోదు చేశారని, కానీ ఆమె వయసు 15 ఏళ్లే అని తన తల్లి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలిక తల్లి తన కుమార్తె తప్పు తెలుసుకుని ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. తన కుమార్తెను క్షమించి గొప్ప మనసు చాటుకున్నారని ఆమె ప్రధానిని కొనియాడారు.
18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించాలని ఆమె సూచించారు. చిన్నారులకు తెలియక సులభంగా ఇతరుల ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. వారి దృష్టి చదువులపైనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

