జైపూర్: ఇద్దరు కుమార్తెలపై ఐదేళ్లుగా తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Raping Daughters For 5 Years) వారు అనారోగ్యం చెందడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఈ దారుణం గురించి బయటపడింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జూన్ 20న కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరు కుమార్తెలను వారి తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్ ఆరా తీయగా గత ఐదేళ్లుగా తండ్రి తమపై అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ బాలికలు తెలిపారు. కడుపులో నొప్పితోపాటు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వారు చెప్పారు. ఇది తెలుసుకుని డాక్టర్, బాలికల తల్లి షాక్ అయ్యారు.
కాగా, బాల కార్మికులు, బాలల లైంగిక హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అనే సంస్థకు ఆస్రా ఫౌండేషన్ నుంచి జూన్ 21న ఈ సమాచారం తెలిసింది. దీంతో బాధిత బాలికలు, ఆమె తల్లిని సురక్షిత ప్రాంతానికి రప్పించారు. జరిగిన దారుణం గురించి తెలుసుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
మరోవైపు ఇద్దరు కూతుళ్లపై ఐదేళ్లుగా తండ్రి అత్యాచారానికి పాల్పడం గురించి ఆ ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ బాలికలను మెడికల్ బోర్డు పరీక్షించింది. మెడికల్ రిపోర్ట్స్‌లో ఈ దారుణం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలికల తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Woman Killed Buried | కోడలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మామ.. గోతిలో మృతదేహం పూడ్చివేత
Gold Stolen From Judge’s Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి.. బంగారం చోరీ
Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్