Tricolour hoisting | ఈ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా ఎగిరింది.. వీడియో
Tricolour hoisting | ఏండ్లు గడుస్తున్నా ఓ ప్రాంతంలో మాత్రం జాతీయ జెండా ఎగురవేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. దేశ ప్రజలు అందరితో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని వారికి ఉన్నా ఏం చేయలేకపోయారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలన్న ఆ గ్రామ ప్రజల ఎన్నో ఏండ్ల కల ఇప్పటికీ తీరింది.
Tricolour hoisting | దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తుండగా.. స్వాతంత్య్రోద్యమంలో అమరులైన వారిని, స్వాతంత్య్ర సమరయోధులను తలుచుకుంటూ ప్రతీ యేటా జరుపుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా ఆగస్టు 15 (శనివారం) న ఘనంగా సంబురాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఏండ్లు గడుస్తున్నా ఓ ప్రాంతంలో మాత్రం జాతీయ జెండా ఎగురవేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. దేశ ప్రజలు అందరితో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని వారికి ఉన్నా ఏం చేయలేకపోయారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలన్న ఆ గ్రామ ప్రజల ఎన్నో ఏండ్ల కల ఇప్పటికీ తీరింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అబుజ్‌మార్ ప్రాంతంలోని బోటర్ గ్రామంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఛత్తీస్‌గఢ్ అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని తెలిసిందే. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేయడం ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని భావించే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ సారి మాత్రం ఆ సంకెళ్లను తెంపుకొని గ్రామ వాసులు, చిన్నారులు జవాన్లు, సైనికులతో కలిసి తొలిసారి జెండావిష్కరణ చేశారు. జవాన్లు జెండావిష్కరణ చేసిన అనంతరం భారత్ మాతా కీ జై అని నినదించగానే.. చిన్నా, పెద్దా అంతా ఆనందంతో చేతులు పైకెత్తుతూ నినాదాలు చేశారు.
ఎవరైనా ధిక్కరిస్తే ప్రజలను కొట్టేవారు.
బోటర్ గ్రామానికి చెందిన యువకుడు కరు రామ్ మాండవి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నక్సలైట్లు ఇక్కడికొచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా మమ్మల్ని అడ్డుకునేవారు.. ఎవరైనా వాళ్ల మాటలను ధిక్కరిస్తే ప్రజలను కొట్టేవారు. గతేడాది నుంచి ఇక్కడికి ఏ నక్సలైట్ రాలేదు. గత సంవత్సరమే ఇక్కడ పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారని అన్నాడు.
తొలిసారి జెండా పండుగను జరుపుకుంటున్న ఆనందం అందరి ముఖాల్లో కనబడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
#WATCH | Chhattisgarh: Tricolour hoisted for the first time in Boter village of Abujmarh on Independence Day today. This was once Naxal-affected, and hoisting the Tricolour here meant a threat to one’s life. (15.08) pic.twitter.com/Ru5HVBvw0g
— ANI (@ANI) August 16, 2026
#WATCH | Chhattisgarh: A local of Boter village, Karu Ram Mandavi, says, “We have hoisted the Tricolour for the first time here today. Before this, Naxals used to come here and forbid us from hoisting the Tiranga. If one defied them, they used to beat up people. No Naxal has come… pic.twitter.com/sEnR99TvxP
— ANI (@ANI) August 16, 2026
Read Also :
National Song | వందేమాతరంపై రాజకీయ వివాదం.. మల్లికార్జున ఖర్గే కోసం సోనియా కుర్చీ అడిగారు: కాంగ్రెస్
NRI | దక్షిణాఫ్రికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీఏఎస్ఏ
Vrushakarma | ‘వృషకర్మ’ టీమ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై కార్తీక్ దండు కీలక అప్డేట్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

