West Bengal | పశ్చిమ బెంగాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత, కుమారుడి దారుణ హత్య
West Bengal | స్వాతంత్య్ర దినోత్సవ వేళ పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో జరిగిన దారుణ జంట హత్యలు కలకలం రేపింది.
West Bengal | స్వాతంత్య్ర దినోత్సవ వేళ పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో జరిగిన దారుణ జంట హత్యలు కలకలం రేపింది. వెస్ట్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు అనిసుర్ రెహమాన్(54), అతని కుమారుడు అబు సుఫియాన్23)లను నకాషిపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెతువాడహరి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి బాధితులు తమ కారులో ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కారును అడ్డగించి అందులో ఉన్నవారిపై కాల్పులు జరిపారు.పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో అనిసుర్ రెహమాన్, అతని కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ఈ హత్యల వెనుక స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు జుబ్బర్ షేక్, అతని అనుచరులే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జుబ్బర్ షేక్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ అతడి ఆదేశాల మేరకే తన అనుచరులతో పథకం ప్రకారం దాడి చేయించారని వారు తెలిపారు. నదియా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డెడ్బాడీస్ను పోస్ట్మార్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. హింస జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, అబు సుఫియాన్ కళ్యాణిలో ఎల్ఎల్బీ చదువుతున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

