ఎన్పీ ఎస్ స్వస్థ్య స్కీమ్
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద ఎన్పీఎస్ స్వస్థ్య కోసం ఇటీవల కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో రిటైర్మెంట్ సేవింగ్స్‌కు పెద్దపీట వేస్తున్నది. అందుకే ఓ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. ఎన్పీఎస్కు అర్హత ఉన్నవారు ఎవరైనా పీఎఫ్ఆర్డీఏ షరతులు, మార్గదర్శకాలకు లోబడి ఎన్పీఎస్ స్వస్థ్యలో చేరవచ్చు.
- పీఎఫ్ఆర్డీఏ కొత్త మార్గదర్శకాలివే
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద ఎన్పీఎస్ స్వస్థ్య కోసం ఇటీవల కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో రిటైర్మెంట్ సేవింగ్స్‌కు పెద్దపీట వేస్తున్నది. అందుకే ఓ సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. ఎన్పీఎస్కు అర్హత ఉన్నవారు ఎవరైనా పీఎఫ్ఆర్డీఏ షరతులు, మార్గదర్శకాలకు లోబడి ఎన్పీఎస్ స్వస్థ్యలో చేరవచ్చు. ఇందులో రెండు భాగాలుంటాయి. ఒకటి పెట్టుబడి ఖాతా, మరొకటి బీమా పాలసీ ఉంటాయి.
- తొలి చందా తప్పనిసరిగా మొదటి సంవత్సరం బీమా ప్రీమియంను కవర్ చేసేలా ఉండాలి. ఎన్పీఎస్ స్వస్థ్య ఖాతాలో ఏటా కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి కోసం చందా చెల్లించే ప్రతిసారి మీ ఖాతాకు కనీసం రూ.10 పెంచుకుంటూపోవాలి.
- 18-40, 40-60, 60-70 ఏండ్లవారికి వేర్వేరు ప్రీమియంలు. ప్రీమియం, పాలసీ షరతులకు లోబడి 85 ఏండ్లదాకా పొడిగించుకోవచ్చు. అలాగే హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ కోసం రూ.200 వార్షిక నిర్వహణ చార్జీ చెల్లించాలి. పన్నులు అదనం.
- రూ.1 లక్ష, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.30 లక్షల ఆరోగ్య బీమా ఆప్షన్లుంటాయి. వీటికి ప్రీమియంలు వరుసగా రూ.10,000, రూ.50,000, లక్ష రూపాయలు, రూ.3 లక్షలుగా ఉంటాయి. కనీస కార్పస్ రూ.25,000.
- పేర్కొన్న వైద్య ఖర్చుల కోసం పాక్షిక ఉపసంహరణలకు వీలుంటుంది. హెల్త్‌కేర్ విత్‌డ్రాయల్స్ కోసం ఎలాంటి వెయింటింగ్ పీరియడ్ ఉండదు. సాధారణ, ప్రీమెచ్యూర్ ఎగ్జిట్లతోపాటు, నగదు చెల్లించకపోతే, సబ్‌స్ర్కైబర్ చనిపోతే ఎన్పీఎస్ స్వస్థ్య ఖాతా క్లోజ్ అవుతుంది.
- స్టాండర్డ్ పాలసీలో ఫ్యామిలీ ఫ్లోటర్ కింద సబ్స్ర్కైబర్తోపాటు, వారి భాగస్వామి, ఇద్దరు సంతానానికి (పిల్లలు) ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుంది. సబ్‌స్ర్కైబర్ తల్లిదండ్రులకు మాత్రం వర్తించదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

