పాట్నా: బీహార్‌కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ప్రసంగిస్తుండగా ఒక డ్రోన్ ఆయన మీదకు దూసుకొచ్చింది. ఇది చూసి ఆయన కాస్త షాక్ అయ్యారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం పాట్నాలోని గాంధీ మైదానంలో ‘వక్ఫ్ బచావో, సంవిధాన్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా సభను కవర్ చేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్ అదుపుతప్పింది.
కాగా, మాట్లాడుతున్న తేజస్వి యాదవ్ వైపు డ్రోన్ దూసుకువచ్చింది. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పక్కకు ఒంగారు. అయితే ఆ డ్రోన్ వేదిక ముందు పడిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | Patna: While addressing ‘Waqf Bachao, Samvidhan Bachao Sammelan’ at Gandhi Maidan, RJD leader Tejashwi Yadav (@yadavtejashwi) narrowly escapes injury as a drone crashes into the podium.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/66B1fMRaHs
— Press Trust of India (@PTI_News) June 29, 2025
Also Read:
Indian woman vanishes in US | పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ మహిళ అదృశ్యం