డెహ్రాడూన్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను పెళ్లాడారు. (BJP Expels Ex-MLA Over Second Marriage) దీంతో బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అమలు చేసిన యూనిఫాం సివిల్ కోడ్‌ను ఆయన ఉల్లంఘించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి ఆయనను బహిష్కరించింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. హరిద్వార్‌లోని జ్వాలాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ రెండో పెళ్లి చేసుకున్నారు. సహరాన్‌పూర్‌కు చెందిన నటి ఊర్మిళా సనావర్‌ను తన రెండవ భార్యగా ఆయన పరిచయం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ ఏడాది జనవరిలో బహుభార్యత్వానికి వ్యతిరేకంగా యూనిఫాం సివిల్ కోడ్‌ను ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది. అయితే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే బీజేపీ నేత సురేష్ రాథోడ్ రెండో పెళ్లి చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘బీజేపీ తన సొంత నాయకులపై చట్టాన్ని అమలు చేయడం లేదు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా యూసీసీని ఒక ఆయుధంగా మాత్రమే ఉపయోగిస్తోంది’ అని కాంగ్రెస్ ఆరోపించింది.
మరోవైపు ఈ విమర్శలపై బీజేపీ స్పందించింది. రెండో పెళ్లి చేసుకున్న సురేష్ రాథోడ్‌కు నోటీస్ జారీ చేసింది. ఆయన వివరణతో బీజేపీ నాయకత్వం సంతృప్తి చెందలేదని తెలిపింది. ‘మీరు పార్టీ క్రమశిక్షణ, సామాజిక ప్రవర్తన నిబంధనలను నిరంతరం ఉల్లంఘించారు. ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు మిమ్మల్ని ఆరు సంవత్సరాల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నాం’ అని ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బిష్ట్ ఒక లేఖలో పేర్కొన్నారు.
Also Read:
Watch: ఇండిగో విమానంలో లైఫ్ జాకెట్ దొంగిలించిన ప్రయాణికుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్