వాషింగ్టన్: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. (Indian woman vanishes in US) దీంతో అమెరికా పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. భారత్‌లోని ఆ మహిళ కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ జూన్ 20న అమెరికా చేరుకున్నది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం ఆ దేశానికి వచ్చినట్లు అమెరికా అధికారులకు తెలియజేసింది.
కాగా, అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు తెలిపారు. జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్ చూస్తున్న ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని అన్నారు.
మరోవైపు కుదిర్చిన పెళ్లి కోసం కాకుండా ఫ్రీగా ట్రావెల్ చేసేందుకు సిమ్రాన్ అమెరికా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు ఎవరూ లేరని తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపురేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టోమసెట్టి కోరారు.
Also Read: