ముంబై: మూడు రోజుల నవజాత శిశువును ఒక ప్లాస్టిక్ బుట్టలో ఉంచి రోడ్డు పక్కన వదిలేశారు. (Newborn Girl Found In Basket) ‘మా ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇలా చేయాల్సి వచ్చింది. క్షమించండి’ అంటూ ఒక నోట్‌ను అందులో ఉంచారు. ఆ శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ సంఘటన జరిగింది. పన్వేల్ ప్రాంతంలోని టక్కా కాలనీలో రోడ్డు పక్కన నీలిరంగు బుట్టలో మూడు రోజుల కిందట పుట్టిన నవజాత శిశువును తల్లిదండ్రులు వదిలేశారు. ఇంగ్లీషులో రాసిన నోట్ కూడా అందులో ఉంచారు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, దీనివల్ల ఆడ బిడ్డను తాము పెంచలేమని పేర్కొన్నారు. తమకు మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని, క్షమించాలని ఆ లేఖలో కోరారు.
కాగా, రోడ్డు పక్కన నీలిరంగు బుట్టలో నవజాత శిశువు ఉండటం చూసి స్థానికులు షాక్ అయ్యారు. పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆడపిల్లను స్వాధీనం చేసుకున్నారు. పిల్లల డాక్టర్‌కు చూపించగా ఆ శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల ఆడపిల్లను రోడ్డు పక్కన బుట్టలో వదిలేసిన తల్లితండ్రుల కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Woman Kills Pet Dog In ‘Tantric’ Ritual | క్షుద్ర పూజల కోసం.. పెంపుడు కుక్కను బలి ఇచ్చిన మహిళ