అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. బెంగళూరుకు ( Bengaluru) చెందిన ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి బయలు దేరారు.
నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి జగదుర్తి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె మృతి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.