V Srinivas Goud | గోదావరి, కృష్ణా నదుల ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. కానీ ప్రాజెక్టులలోని అన్ని పంపులను ఆన్ చేసి, రిజర్వాయర్లను నింపుకోవాలనే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూరాల నుంచి కిందున్న అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్సెట్లు ఆన్ చేసుకోవాలి.. అన్ని రిజర్వాయర్లు నింపుకోవాలి.. తాగునీటి అవసరాలకు మాత్రమే మేం నీళ్లిస్తాం.. వ్యవసాయానికి నీళ్లివ్వం అనే ధోరణిలో అధికారులు మాట్లాడుతున్నారు. దాదాపు నిన్న 45-50 వేల క్యూసెక్కుల పవర్ జనరేషన్ పేరు మీద నీళ్లు వదులుతున్నరు.. కానీ ఉన్న రిజర్వాయర్లను నింపాలి.. పంపులు ఆన్ చేయాలనేది మాత్రం విస్మరించారని అన్నారు.
గోదావరి, కృష్ణా నదుల ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. కొన్ని పంపులు ఆన్ చేశారు.. మరికొన్ని చేయలేదన్నారు. నీళ్లు వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి కానీ వదలన్నీ బంద్ అయినప్పుడు ఏం చేస్తరని ప్రశ్నించారు. వరదలు వచ్చి జూరాల నిండుతున్నా పంపులు ఆన్ చేయలేదన్నారు. రైతులంతా ధర్నా చేస్తం.. మేమే ఆన్ చేసుకుంటమని ధర్నా చేస్తే నిన్న ఆన్ చేశారు. ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ ఫ్లో కూడా అంతే పవర్ జనరేషన్ పేరు మీద మొత్తం కింది వెళ్లిపోతున్నయన్నారు.
ఎల్ నినో దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల నుండి కిందకి వృథాగా పోతున్న ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో స్పందించకపోతే పాలమూరు ఎడారి కాక తప్పదని అధికారులు, ప్రభుత్వానికి హెచ్చరించారు.
గోదావరి, కృష్ణా నదుల ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది.
కానీ ప్రాజెక్టులలోని అన్ని పంపులను ఆన్ చేసి, రిజర్వాయర్లను నింపుకోవాలనే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.ఎల్ నినో దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల నుండి కిందకి వృథాగా పోతున్న ప్రతి చుక్కను ఒడిసి… pic.twitter.com/mBoonRZn9S
— BRS Party (@BRSparty) July 30, 2026
Municipal Commissioner | భద్రకాళి బండ్పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు