IIT Delhi | ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IIT Delhi) 12 నెలల ఆన్లైన్ పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. ఆ కోర్సు పేరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI) డిజైన్. ఈ కోర్సు విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్, మెడికల్ డివైజెస్, ఆటోమోటివ్ సిస్టమ్‌లు తదితర అన్నింటిలో క్లిష్టమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల సృష్టి, విధానాలను నేర్పుతారు.
రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత (Technology), అధిక పనితీరు, తక్కువ విద్యుత్ వినియోగం, పరిమాణంలో చిన్నగా ఉండేవాటివైపు దృష్టిసారిస్తున్నందు వల్ల నైపుణ్యం కలిగిన VLSI డిజైన్ నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ కోర్సు విద్యార్థులతో పాటు సంస్థల్లో పనిచేసేవారికి కూడా సెమీకండక్టర్ పరికరాలు, VLSI సర్క్యూట్స్, సిస్టమ్స్‌లను డిజైన్, ఆప్టిమైజ్, విశ్లేషణ చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యం పొందగలుగుతారు.

Vlsi
ఎవరు అర్హులు
బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్) చదివిన విద్యార్థులు, ఉద్యోగానుభవం ఉన్నవారు అర్హులు. ఈ ఆన్లైన్ పీజీ డిప్లొమా ఇన్ VLSI డిజైన్ కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 1180.
క్లాసులు
ఈ కోర్సు క్లాసులు 2027, జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. 2028, జనవరి 30 వరకు కొనసాగుతాయి. క్లాసులు వీకెండ్స్ (శని, ఆదివారాలు)లో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నడుస్తాయి.

Online
ఈ ప్రోగ్రామ్‌లో రెండు సెమిస్టర్లలో మొత్తం తొమ్మిది కోర్సులు ఉంటాయి. వీటిలో ఫండమెంటల్ సర్క్యూట్ అనాలిసిస్, డిజిటల్ ఎకనామిక్స్, అనలాగ్ సర్క్యూట్ డిజైన్, MOS VLSI, మినీ ప్రాజెక్టులు, అడ్వాన్స్డ్ అనలాగ్ డిజైన్, మిక్స్డ్ సిగ్నల్ సర్క్యూట్ డిజైన్, IEC ల్యాబ్, మేజర్ ప్రాజెక్టుల గురించి బోధిస్తారు.
ప్రొఫెసర్ ముకుల్ సర్కార్, ప్రొఫెసర్ అంకేశ్ కో ఆర్డినేట్ చేస్తారు. IIT Delhi ఫ్యాకల్టీలు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ బోధిస్తారు. ఈ కోర్సు చదివేవారికి రెండు రోజులు ఐఐటీ ఢిల్లీని సందర్శించే అవకాశం కూడా ఉంది. ఈ కోర్సు ఫీజు రూ. 3,50,000.