Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని (MGM Hospital) పైకప్పు పెచ్చులు ఊడిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా ఆంక్షలు విధించారు. హాస్పిటల్ గేటు ముందు పోలీసులను భారీగా మోహరించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు ఎంజీఎం ఆసుపత్రిలో వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకున్న పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వినయ్ భాస్కర్ కడుపులో తన్నారు. పోలీసులు కడుపులో తన్నారని, దాడిలో తన చేయి విరిగిందంటూ వినయ్ భాస్కర్ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో ఈ వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది. వినయ్ భాస్కర్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతుండటం చూడొచ్చు.
బ్రేకింగ్ న్యూస్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కడుపులో తన్నిన పోలీసులు
చేయి విరిగిందంటూ కంటతడి పెట్టుకున్న వినయ్ భాస్కర్
ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం… https://t.co/djFHxNy31F pic.twitter.com/v4MPVdgqDh
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన