Hockey India: హాకీ ప్లేయర్లకు కాషాయం జెర్సీ.. కలర్ మార్పును సమర్ధించుకున్న హాకీ ఇండియా
Hockey India: కాషాయ రంగు జెర్సీలో హాకీ ప్లేయర్లు మెరవనున్నారు. వచ్చే నెలలో జరగనున్న వరల్డ్‌కప్‌లో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమిస్తారు. జెర్సీ కలర్ మార్పును హాకీ ఇండియా సమర్ధించుకున్నది.
న్యూఢిల్లీ: హాకీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నది. నెదర్లాండ్స్, బెల్జియం దేశాల్లో జరగనున్న వరల్డ్‌కప్‌లో .. టీమిండియా ప్లేయర్లు కాషాయం రంగు జెర్సీల్లో ఆడనున్నారు. గతంలో ఉన్న బ్లూ కలర్ జెర్సీలను మార్చేశారు. దీనిపై ఇవాళ హాకీ ఇండియా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సంప్రదాయ బ్లూ కిట్స్ స్థానంలో.. కాషాయ కిట్స్‌లో భారత మహిళల, పురుషుల హాకీ ప్లేయర్లు కనిపించనున్నట్లు హాకీ ఇండియా పేర్కొన్నది. వచ్చే నెల 15వ తేదీ నుంచి హాకీ వరల్డ్‌కప్ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే.
జెర్సీ రంగు మార్పు గురించి మాజీ కెప్టెన్ వీరేన్ రస్క్వినా ప్రశ్నించారు. అయితే సాంకేతిక అవసరాల దృష్ట్యా జెర్సీ కలర్‌ను మార్చినట్లు హాకీ ఇండియా స్పష్టం చేసింది. బ్లూ రంగు సింథటిక్ పిచ్‌లపై విజిబులిటీ పెంచేందుకు జెర్సీ రంగును కాషాయానికి మార్చినట్లు హాకీ ఇండియా చెప్పింది. ఇటీవల సోషల్ మీడియాలో హాకీ ఇండియా కొత్త జెర్సీలపై ఓ పోస్టు కూడా పెట్టింది. జెర్సీ కలర్, డిజైన్ వెనుక కథ ఉన్నట్లు పేర్కొన్నది. కొత్త జెర్సీలు భారతదేశ గర్వానికి సంకేతమని చెప్పింది. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌తో సంప్రదించిన తర్వాత ఆ రంగును మార్చినట్లు హాకీ ఇండియా వెల్లడించింది.
కాషాయం రంగు.. ధైర్యానికి, త్యాగానికి, విజయానికి సంకేతంగా నిలుస్తుందని తన ప్రకటనలో హాకీ ఇండియా తెలిపింది. ప్రస్తుతం హాకీ పిచ్‌లు అన్నీ బ్లూ రంగులో ఉంటున్నాయని, సింథటిక్ పిచ్‌లు బ్లూ కలర్లో ఉండడం వల్ల.. బ్లూ జెర్సీలో ఇండియా ప్లేయర్లు ఆడడం ఇబ్బందిగా మారినట్లు గుర్తించారు. జెర్సీలు బ్లూ.. పిచ్ బ్లూ కావడం వల్ల.. ప్లేయర్ల మధ్య సమన్వయం లోపిస్తున్నట్లు భావించారు. అయితే ప్లేయర్ల మధ్య విజిబులిటీ పెంచేందుకే.. జెర్సీ కలర్‌ను మార్చినట్లు హాకీ ఇండియా చెప్పింది.
పసుపు లేదా కాషాయం కలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు అని కోచ్‌లు, ఆటగాళ్లు ఇచ్చిన సలహా మేరకే కాషాయం రంగును జెర్సీలకు ఎంపిక చేసినట్లు హాకీ ఇండియా చెప్పింది. సాంకేతిక కారణాలే కాకుండా, జాతీయ జెండాలో ఉన్న కాషాయాన్ని ఆ కలర్ సూచిస్తుందని హాకీ ఇండియా పేర్కొన్నది. జెర్సీపై మండలా ప్రేరణతో డిజైన్ చేసిన ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది భారతీయ సంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలువనున్నది.
అశోక చక్ర స్పూర్తితో డీప్ నేవీబ్లూ బార్డర్ కలర్ వాడినట్లు హాకీ ఇండియా పేర్కొన్నది. ప్రొగ్రెస్కు, శాంతికి, ఫోకస్‌కు డీప్ నేవీ బ్లూ సంకేతంగా నిలుస్తుందన్నారు. ఛెస్ట్ మీద ఉన్న గ్రాఫిక్.. సుదర్శన చక్ర లాంటిందని హాకీ ఇండియా పేర్కొన్నది. దేవనాగరి భాషలో ఇండియా అని జెర్సీ ముందు భాగంలో రాసి ఉంటుంది. కాషాయంతో పాటు కొత్త డిజైన్‌తో కూడిన వైట్ కలర్ జెర్సీలు కూడా ప్లేయర్ల వద్ద ఉండనున్నాయి.
Every thread tells a story. Every crest carries a dream. 🇮🇳
The Indian Men’s Hockey Team unveils its new jersey ahead of the FIH Hockey Men’s World Cup Belgium & Netherlands 2026—a symbol of pride, passion, and the unwavering belief of millions.
Here’s to giving everything for… pic.twitter.com/AhzmJtvq3S
— Hockey India (@TheHockeyIndia) July 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

