ViRoshWedding | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమవడంతో అక్కడ ఒక్కసారిగా సందడి నెలకొంది. కొత్త పెళ్లికూతురు రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. తమ అభిమాన జంటను చూడటానికి ఎయిర్‌పోర్ట్‌కు భారీగా చేరుకున్న అభిమానులకు విజయ్, రష్మిక చిరునవ్వుతో అభివాదం చేస్తూ, ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#WATCH | Newlyweds Vijay Deverakonda and Rashmika Mandanna arrive at Udaipur airport, greet their fans pic.twitter.com/ZRJAFVUrYz
— ANI (@ANI) February 27, 2026