Robo | ‘రోబో’ రీరిలీజ్‌పై పెరుగుతున్న డిమాండ్.. ఈసారి 4కే కాదు, అన్ని ప్రీమియం ఫార్మాట్లలోనా?
Robo | భారతీయ సినిమా చరిత్రలో సాంకేతికంగా, విజువల్‌గా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’కు ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లోనే ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
Robo | భారతీయ సినిమా చరిత్రలో సాంకేతికంగా, విజువల్‌గా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’కు ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లోనే ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. రజినీకాంత్ స్టార్డమ్, శంకర్ విజన్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక సాంకేతికత.. ఇవన్నీ కలసి ‘రోబో’ను ఒక ఎపిక్ మూవీగా నిలబెట్టాయి. విడుదలై ఇన్నేళ్లు గడిచినా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘రోబో’ను మరోసారి థియేటర్లలో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ డిమాండ్ మరింత పెరగడం ఆసక్తికరంగా మారింది.
గత కొద్ది రోజులుగా ‘రోబో’లోని పలు యాక్షన్ సన్నివేశాలు, అప్పట్లోనే చూపించిన ఆధునిక సాంకేతిక అంశాలకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలైన సమయంలోనే ఇంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌ను శంకర్ ఎలా ఊహించగలిగారంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, రోబో పాత్రకు సంబంధించిన సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌ను అభిమానులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. దీంతో ‘రోబో’ను థియేటర్లలో మళ్లీ విడుదల చేయాలనే డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే అభిమానుల కోరిక కేవలం రీరిలీజ్‌తో ఆగడం లేదు. ఇంతటి భారీ విజువల్ వండర్‌ను కేవలం సాధారణంగా లేదా 4కే రూపంలో మాత్రమే కాకుండా.. అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం ఫార్మాట్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రానికి భారీ తెర, అత్యుత్తమ సౌండ్, ఆధునిక ప్రొజెక్షన్ టెక్నాలజీ మరింత మంచి అనుభూతిని ఇస్తాయని అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈసారి సినిమా రీరిలీజ్ జరిగితే సాధారణ రీరిలీజ్ కాకుండా ఒక ఈవెంట్‌లా ఉండాలని కోరుకుంటున్నారు. ఆసక్తికరంగా ఈ రీరిలీజ్ చర్చకు తెలుగు యువత నుంచి మరింత స్పందన రావడంతో సోషల్ మీడియాలో విషయం వేగంగా వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న భారీ అభిమానగణంతో పాటు.. శంకర్ సినిమాలకు ఉన్న క్రేజ్ కూడా ఈ డిమాండ్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో రీరిలీజ్ అయిన పలు స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు భారీగా స్పందించిన నేపథ్యంలో ‘రోబో’ను కూడా అదే స్థాయిలో థియేటర్లలోకి తీసుకువస్తే మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- graphics
- re-release
- robo
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

