Idupu Kayitham First Single | టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘ఇడుపుకాయితం’. సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై బన్నీ వాస్, తాబితా సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘నువ్వు సిన్నబోకే నా శ్రీలత’ అంటూ సాగే ఫోక్-మెలోడీ ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి అందించిన గ్రామీణ వాతావరణాన్ని తలపించే బాణీలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలరాజు సాహిత్యానికి శంకర్ బాబు, మోహన భోగరాజు, సీలం పున్నమ్మ, బొల్లెపోగుల సుభద్ర తమ అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. యూట్యూబ్‌లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ లిరికల్ సాంగ్ లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతూ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది.