Frank Shaw: 29 ఏళ్ల తర్వాత.. మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న కమ్యూనికేషన్స్ ఆఫీసర్
Frank Shaw: మైక్రోసాఫ్ట్ కంపెనీలో మూడు దశాబ్ధాలుగా సేవలు అందించిన చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ షా తన ఉద్యోగాన్ని వీడనున్నారు. తన నిర్ణయం గురించి ఆయన ఉద్యోగులకు ఇంటర్నల్ మెమో ద్వారా వెల్లడించారు. లింకిడిన్‌లో ఓ నోట్ షేర్ చేశారు.
లాస్ ఏంజిల్స్: మైక్రోసాఫ్ట్ కంపెనీలో మూడు దశాబ్ధాలుగా సేవలు అందించిన చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ షా(Frank Shaw) తన ఉద్యోగాన్ని వీడనున్నారు. తన నిర్ణయం గురించి ఆయన ఉద్యోగులకు ఇంటర్నల్ మెమో ద్వారా వెల్లడించారు. లింకిడిన్‌లో ఓ నోట్ షేర్ చేశారు. ఇక ఉద్యోగాన్ని వీడి, జీవితంలో కొత్త అన్వేషణ ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 29 ఏళ్లుగా ఆయన మైక్రోసాఫ్ట్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. కంపెనీకి చెందిన పీఆర్ ఏజెన్సీ వాగ్నర్ ఎడ్స్ట్రామ్లో ఆయన కొన్నేళ్లుగా చేశారు. అయితే 17 ఏళ్లుగా మాత్రం ఆయన మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా చేస్తున్నారు.
ఇక ఈ ఏడాది చివరి వరకు ఆయన ఉద్యోగంలో కొనసాగనున్నారు. ఆ పోస్టుకు కొత్తగా ఎవరు వస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.1997 నుంచి మైక్రోసాఫ్ట్‌లో ఫ్రాంక్ షా స్ట్రాటజిక్ మెసేజింగ్ ఆఫీసర్‌గా చేశారు. విండోస్ లాంచింగ్ సమయాల్లో ఆయన పబ్లిక్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ చూసుకున్నారు. మార్కెటింగ్ చీఫ్ తకేసితో తన నిర్ణయాన్ని పంచుకున్నట్లు చెప్పారు. కమ్యూనికేషన్ టీమ్‌లో అనేక మంది ట్యాలెంట్ ఉద్యోగులతో పనిచేసినట్లు ఆయన తెలిపారు.
a bit of news. 🙂 https://t.co/UwXEMI153u
— Frank X. Shaw (@fxshaw) September 11, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

