Boggula Sriniavas : రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతిపై నెలకొన్న మిస్టరీ వీడింది. నమ్మకద్రోహానికి పాల్పడిన స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డి మరో ముగ్గరితో కలిసి శ్రీనివాస్‌ను అంతమొందించాడు. జీఎస్టీ లైసెన్స్(GST License) విషయమై ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలోనే హత్యకు ప్రణాళిక రచించారని కూసుమంచి పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పాలేరు రిజార్వాయర్‌లో కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్ మృతిచెందాడని నమ్మించే ప్రయత్నం చేసిన నిందితులు.. విచారణలో తామే చంపినట్టు అంగీకరించారు.
పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో పుస్తకంతో పాపులరైన బొగ్గుల శ్రీనివాస్ ఫిబ్రవరి 14న పాలేరు రిజర్వాయర్‌లో విగత జీవిగా కనిపించారు. కారు రిజర్వాయర్కి దూసుకెళ్లిన ఘటనలో ఆయన మరణించినట్టు మొదట్లో వార్తలు వచ్చినా.. తల, ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు గొల్ల @ బొగ్గుల శ్రీనివాస్ హైదరాబాద్‌లో నివసించేవారు.
యూట్యూబ్, ఇంస్టాగ్రామ్లలో వీడియోలు చేసే ఆయన ప్రధాన నిందితుడు (A1) మేకల వేణుమాధవ్ రెడ్డి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. ఒకసారి కాలేజీ పూర్వ విద్యార్దుల సమ్మేళనానికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్‌కు BOGGULA BBQ పేరుతో GST లైసెన్స్ ఉంది. మేకల వేణుమాధవ్ రెడ్డి సొంతంగా “మేకా ప్రాజెక్ట్స్” అనే కంపనీ పెట్టి సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. BOGGULA BBQ పేరు మీద ఫేక్ ఇన్ వాయిస్ అండ్ సేల్స్ ఫైల్ చేసి మంచి లాభాలు సంపాదించ వచ్చని వేణుమాధవ్ రెడ్డి చెప్పగా, శ్రీనివాస్ సరేనన్నారు. తన జీఎస్టీ లైసెన్స్ఉపయోగించుకున్నదుకు 50% ప్రాఫిట్ ఇవ్వాలని శ్రీనివాస్ షరతు పెట్టారు. అందుకు అంగీకరించిన మేకల వేణుమాధవ్ రెడ్డి 2022-25 వరకు జీఎస్టీ ఫైలింగ్స్‌తో దాదాపు రూ. 90 లక్షలు సంపాదించాడు.
ఒప్పందం ప్రకారం అందులో శ్రీనివాస్ వాటా రూ. 45 లక్షలు కాగా.. వేణుమాధవ్ రెడ్డి రూ. 15 లక్షలే ఇచ్చాడు. తాను ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నందున మిగతా రూ.30 లక్షలు తరువాత ఇస్తానని శ్రీనివాసుకు చెప్పాడు. అంతలోనే జీఎస్టీ మోసానికి సంబంధించి మేకల వేణుమాధవ్ రెడ్డి, శ్రీనివాస్‌కు జీఎస్టీ డిపార్డ్మెంట్ నుండి నోటిసులు వచ్చాయి. శ్రీనివాస్ పేరిట ఉన్న BOGGULA BBQ లైసెన్స్‌ను జీఎస్టీ విభాగం క్లోజ్ చేసింది. దీంతో శ్రీనివాస్ తనకు చెల్లించాల్సిన రూ.30 లక్షలు, క్లోజ్ అయిన GST లైసెన్స్‌ను యాక్టివ్ చేయాలని కోరారు. అట్టి లైసెన్సు పునరుద్దరించాలంటే దాదాపు కోటి రూపాయలకు పైనే జరిమానా కట్టవలసి ఉంటుంది. ఇట్టి విషయంలో శ్రీనివాస్, వేణుమాధవ్ రెడ్డి మధ్య వివాదాలు తలెత్తాయి.
ఆర్థిక ఒత్తిడి, లైసెన్సు యాక్టి వేషన్కు కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో A1. మేకల వేణుమాధవ్ రెడ్డి, A2 పోకల కోటేశ్వర రావు (అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), A3 షేక్ అబ్దుల్ హఫీజ్ మరియు A4 ఎమ్.డి. అజ్మత్ అలీ ఖాన్‌లతో కలిసి శ్రీనివాస్‌ను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. అందుకుగాను A3 షేక్ అబ్దుల్ హఫీజ్ మరియు A4 ఎమ్.డి. అజ్మత్ అలీ ఖాన్లకు వేణుమాధవ్ రెడ్డి రూ.5 లక్షల సూఫారీ ఇచ్చాడు. తమ పథకం ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీన రాత్రి శ్రీనివాస్‌ను ఫోన్ చేసి.. పెండింగ్‌లో ఉన్న డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికాడు వేణుమాధవ్ రెడ్డి. విజయవాడకు వెళ్దామని చెప్పి ఆయనను వాహనంలో తీసుకువెళ్లారు. ఫిబ్రవరి 14న తెల్లవారుజామున నకిరేకల్ నుండి జనగాం వైపు వెళ్ళే దారిలో.. జనసంచారం లేని ప్రదేశంలో కారులో నిందితులు కత్తులు, ఐరన్ రాడ్లతో శ్రీనివాస్ తలపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ప్రెస్ నోట్
Cr.No. 45/2026 U/s 103, 61,238 r/w 3(5) BNS of Kusumanchi Police Station, Dt. 15.02.2026
Complainant:
Golla Abdulaiah @ BoggulaAbdulaiah S/oChennarayudu, 60 years, Agriculture, R/o Alluru village, Nandikotkuru Mandal, Nandhyala District, Andhrapradesh,
Names of the accused (4):
A1.Mekala Venu Madhava Reddy S/o Bhushi Reddy, 38 yrs, Business,
R/o, Pakalapadu (V), Sathanapally (M), Palnadu(Dist.)
Now at, Kukatpally, Hyderabad.
A2. Pokala Koteswara Rao S/o Krishna Rao (Late), 52 yrs, , Farmer R/o
Aswaraopeta village of BhadradriKothagudem Dist.
A3. Shaik Abdul Hafeez S/o Pentu Saheb, 42 yrs, Tutor (Arabic), R/o
Vinayakapuram village, Ashwaraopeta, Asupaka, BhadradriKothagudem
Mandal. Now at Malakpet, Hyderabad.
A4. MD. Azmathali Khan S/o Abdul Khadu Jelani, 33 yrs, , Driver
R/o Chunchupalli, Kothagudem Dist.
Now at Safal basthi, Kothagudem.
శ్రీనివాస్ హత్య అనంతరం రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు మృతదేహంతో పాటు వాహనాన్ని పాలేరు రిజర్వాయర్‌లో పడవేసినట్లు సమాచారం. సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. హత్యలో ఉపయోగించిన ఆయుధాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి టీ. సంజీవ్, కూసుమంచి సీఐ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
శ్రీనివాస్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదైన వెంటేనే ఖమ్మం రూరల్ ఏసీపీ చాకచక్యంగా వ్యవహరించి కూసుమంచి CI T. సంజీవ్ ఆధ్వర్యంలో కూసుమంచి SI J.నాగరాజు, నేలకొండపల్లి SI P. సంతోష్, తిరుమలాయపాలెం SI T.జగదీష్, PSI దివ్యలతో.. నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి కేసు త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సహకారం అందించిన నేలకొండపల్లి, తిరుమలయపాలెం, కూసుమంచి SI లకు, సాంకేతిక సహకారం అందించిన శ్రీకాంత్, సతీశ్, వినయ్, ఉదయ్ మరియు సిబ్బంది పూర్ణ చందర్ రావు, శ్రీశైలం, శ్రీలత, సయ్యద్, శోభన్, సీతారాములు, హోమ్ గార్డ్ రాంబాబును అభినందించారు.