Lok Sabha | లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్
Lok Sabha : వచ్చే వారం లోక్‌సభలో స్పీకర్‌పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
Lok Sabha : వచ్చే వారం లోక్‌సభలో స్పీకర్‌పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ప్రతి ఒక్కరూ సభలో చర్చ, ఓటింగ్ సందర్భంగా అందుబాటులో ఉండాలని ఆదేశించాయి. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ గత నెలలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాయి.
దీనిపై ఈనెల 9, 10 తేదీల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుంది. అందువల్ల ఈ రెండు రోజుల్లో తమ ఎంపీలు అందరూ సభకు హాజరవ్వాలని, అందుబాటులో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ మేరకు తమ ఎంపీలు సభలో ఉండి, ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బీజేపీ సూచించింది. స్పీకర్ ఓంబిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కోరుతూ గత నెలలో ప్రతిపక్షాలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసి, నోటీసులు ఇచ్చారు. అయితే, నోటీసు ఇచ్చిన తర్వాత నుంచి సభ వాయిదా పడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. కేంద్ర బడ్జెట్‌పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదాపడ్డాయి. సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు.
రెండో దశ బడ్జెట్ సమావేశాల్లోనే ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతారు. తర్వాత దీనిపై చర్చ, ఓటింగ్ ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు స్పీకర్ చైర్లో ఓం బిర్లానే ఉంటారు. సోమవారం ప్రారంభం కానున్న చర్చ సమయంలో మాత్రం ఆయన సాధారణ ఎంపీలాగే సభలో కూర్చుంటారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం ఒక ఎంపీగా.. తన స్పీకర్ పదవిని రక్షిస్తూ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. తాజా సమావేశాలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- lok sabha
- Om Birla
- Parliament
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

